ఈ మండల బిడ్డను… బాధ్యతగా పని చేశా..!

Feb 12,2024 15:35 #Anantapuram District
This Mandal child.... worked responsibly..!

టిడిపి చరిత్రలో చేయలేని విధంగా ఆత్మకూరు మండలానికి తాగు నీళ్లు తీసుకొచ్చా..!

18న రాప్తాడులో నిర్వహించే “సిద్ధం” సభను జయప్రదం చేయాలి..!

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

ప్రజాశక్తి-ఆత్మకూరు : గతంలో ఎవరెవరో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆత్మకూరు మండలంలో ఏళ్ల తరబడిగా ఉన్న తాగునీటి సమస్య అలానే ఉండిపోయింది. ఈ మండలం వాసి, మీ బిడ్డ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లి ఒడ్డుపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరించారు. ఆనంతరం శ్రీకృష్ణదేవాలయ నిర్మాణ భూమి పూజ చేశారు. తర్వాత ఎస్సీ కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మండలంలోని అన్ని గ్రామాలకు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి 117 కోట్లు మంజూరు చేయించాం. పెన్నహోబిలం రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు మండలం, అనంతపురం రూరల్ మండలం పాపంపేట వరకు నేరుగా పైప్ లైన్ నిర్మించి తాగనీరు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. పైపు లైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లోపు ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు తుంగభద్ర జలాలు అందజేస్తాం. ఈనెల 18న రాప్తాడు లో నిర్వహించే “సిద్ధం” సభను జయప్రదం చేయాలి. మండలంలోని ప్రతి గ్రామము నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు, రైతులు తరలివచ్చి జగనన్నకు మద్దతు పలకాలి. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.

➡️