ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న ఎంవిఐ రాజాబాబు
ప్రజాశక్తి-గుంతకల్లు
స్థానిక ఆర్‌టిఒ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించనున్న ఉచిత మెగా వైద్యశిబిరంలో డ్రైవర్లందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ నీలం వెంకట రాజాబాబు పిలుపునిచ్చారు. ఈమేరకు సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల డ్రైవర్లు అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదన్నారు. కావున స్థానిక ఆర్టీవో కార్యాలయం వద్ద నంద్యాలకు చెందిన శాంతి రామ్ ఆసుప్తరి వారి సౌజన్యంతో నిర్వహించనున్న వైద్య శిబిరంలో వైద్య చికిత్సలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో, లారీ, జీపు డ్రైవర్లు, ఆర్టీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.