నేడు ‘అనంత ఉద్యానవన సమ్మేళనం’

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

అనంత వేదికగా జాతీయ స్థాయి ”అనంత హార్టికల్చర్‌ కాంక్లేవ్‌” కార్యక్రమం బుధవారం జరగనుంది. అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్‌ ఎంవైఆర్‌ కన్వెన్షనల్‌ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమం ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను, ఐడి కార్డులను సిద్ధం చేయాలని డిపిఒకు సూచించారు. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు అనేది ముందుగానే చూసుకొని వారికి ఒక అధికారిని అటాచ్‌ చేయాలని, అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. అవసరమైన ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని, రిజిస్ట్రేషన్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని, కార్పొరేట్‌ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వినూత్న, ఆర్డీవో కేశవనాయుడు, అడిషినల్‌ ఎస్పీ రమణమూర్తి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, హార్టికల్చర్‌ డిడి నరసింహారావు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వరమ్మ, ఎపిఎంఐపి పీడీ రఘునాథరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ మల్లికార్జున, జెడ్పీ సిఇఒ ఆర్‌.రామచంద్ర రెడ్డి, సిపిఒ అశోక్‌ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️