అక్షర యోధుడుకి ఘన నివాళులు

Jun 8,2024 16:31 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో అక్షర యోధుడు, ఈనాడు, మార్గదర్శి సంస్థల చైర్మన్ రామోజీరావు  చిత్రపటానికి జిల్లా టిడిపి నాయకులు ఆలం వెంకట నరసానాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా టిడిపి నాయకులు ఆలం వెంకట నరసానాయుడు మాట్లాడుతూ రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలు వెలకట్టలేనివి అని అన్నారు. పత్రికా రంగానికి, మీడియాకు ఒక గుర్తింపు ఖ్యాతి తెచ్చిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసమే ఆయన అక్షరం కదిలిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీన ఎర్రి నాగప్ప, టిడిపి నాయకులు ప్రతాప్ చౌదరి, అలం నాగార్జున నాయుడు, బండ్లపల్లి సర్పంచ్ వెంకటనారాయణమ్మ, పి ఎల్ లక్ష్మీనారాయణ, తెలుగు యువత చంద్రబాబు, బండ్లపల్లి సాంబశివారెడ్డి, మంగపట్నం వెంకటనారాయణ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రంగాపురం రామ్మూర్తి నాయుడు, దుగుమర్రి చంద్రశేఖర్ రెడ్డి, శివారెడ్డి,నరసాపురం సత్తి, గూగుడు రాజన్న, నల్లపరెడ్డిపల్లి చక్రవర్తి, వడ్డే మహేష్, తలారి హరీష్, గణేష్,మహేష్, నడిమింటి రాము, తుంపెర రాధకృష్ణ, గోవర్ధన్,రమేష్ రెడ్డి,లక్షుంపల్లి లక్ష్మీనారాయణ, సీన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️