సిఎం రిలీఫ్ చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి
ప్రజాశక్తి-అనంతపురం రూరల్
తిరుమల తిరుపతి దేవస్థానం దోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి దుష్ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. సోమవారం నగరంలోని అనంతపురం అర్బన్ కార్యాలయంలో 12 మందికి మంజూరైన 12.15 లక్షల చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అర్బన్ నియోజకవర్గానికి 12 విడుతల్లో రూ.1.9కోట్లు మంజూరు చేస్తే సగం మొత్తం మైనార్టీలకే అందించామన్నారు. ఇకపోతే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హిందూ వ్యతిరేకవాది అన్నారు. గతంలో ఆయన శ్రీవెంకటేశ్వరస్వామిని నల్లరాయితో పోల్చారని, ఇప్పుడు ఎక్కడో చనిపోయిన గోవులను టిటిడి గోశాలలో చనిపోయాయని చూపిస్తున్నారన్నారు. ఇప్పటికైనా వైసిపి నాయకులు ఇలాంటి దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గంగారాం, కూచి హరి, రాయల్ మురళి రాయల మధు, సయ్యద్ సైఫుద్దీన్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.