నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
గుంతకల్లు రూరల్ : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసి ఆరు మెటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ ఎన్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కసాపురం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల ఎస్‌ఐ టిపి వెంకటస్వామితో కలిసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుత్తి పట్టడానికి చెందిన మోతే రాజేష్, మాల ప్రవీణ్‌కుమార్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతుండేవారు. ఇందులో భాగంగానే స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం వెనుక ఉన్న రైల్వే క్వార్టర్ సమీపంలో ఓ మహిళ మెడ నుండి బంగారు ఛైన్‌ను లాక్కెళ్లారు. గతంలో ఆరు కేసులరుపైగానే వీరిద్దరిపై నమోదయ్యాయి. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం భగత్‌సింగ్ కాలనీలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం నిందితుల నుంచి ఆరు మోటార్ సైకిళ్లు, 3.5 తులాల బంగారు చైను, రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంతోపాటు వస్తువుల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన రూరల్ సిఐ, కసాపురం ఎస్‌ఐ కానిస్టేబుల్ సుంకన్న, వెంకటేశును డీఎస్పీ అభినందించారు.