ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో నేటి నుండి 21 వరకు పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అలివేలమ్మ ప్రకటనలో తెలిపారు. నేడు ఏ కొండాపురం, కంది కాపుల, కడవకల్లు, సూర్య పల్లి, 15వ తేదీ అరకటివేముల, దోస లేడు, మడ్డిపల్లి, చాలు వేముల, 16వ తేదీన కుమ్మనమల, రంగరాజు కుంట, చెర్లోపల్లి, 17వ తేదీన మడుగు పల్లి, ఎల్లుట్ల, జంగం రెడ్డి పేట, 18వ తేదీన ఎస్ గూడూరు, గాండ్లపాడు, కొండేపల్లి, తక్కలపల్లి 19 వ తేదీన బాలాపురం, సి. వెంగన్నపల్లి, కోమటికుంట్ల, 20 తేదీన పుట్లూరు 21వ తేదీన గరుగు చింతలపల్లి పంచాయతీలకు సంబంధించి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి నాయకులు అధికారులు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.
