పోస్లర్లను విడుదల చేస్తున్న విఆర్‌ఎలు
ప్రజాశక్తి-శింగనమల
అర్హులైన విఆర్‌ఎలకు విఆర్‌ఒలుగా పదోన్నతులు ఇవ్వాలని విఆర్‌ఎల జిల్లా అధ్యక్షులు వి.ఓబులేష్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విఆర్‌ఎల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా గ్రామాల్లో విఆర్‌ఎలుగా విధులు నిర్వహిస్తున్న అర్హులందరికీ పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలన్నారు. అలాగే చాలామంది ఇప్పటికీ నామినీలుగానే విఆర్‌ఎల్‌గా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారిని రెగ్యులర్ విఆర్‌ఎలుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ వాల్మీకి నాగరాజు, జిల్లా సహాయ అధ్యక్షులు చంద్రమోహన్, నాగరాజు, గ్రామ రెవెన్యూ సహాయకులు రామాంజనేయులు, ధనుజయ, శ్రీనివాసులు, వరదరాజులు, నాగరాజు, దేవదాసు, మౌలాలి, వెంకటేష్, నాగరత్న, ఓబులేసు, ఖాజాబీ, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.