బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన వాకింక్ బ్యాచ్

Jan 23,2025 09:46 #Anantapuram District

21వేల 500 రూపాయల సహాయం

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలలో స్థానిక శివాలయం వద్ద ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి బట్టలు, కుక్కర్లు, సామాన్లు అమ్ముకునే వారి ఆటో షార్ట్ సర్క్యూట్ అయి పూర్తిగా కాలిపోవడంతో ఆటోలో ఉన్న సుమారు రెండు లక్షల మేర సామాగ్రి మొత్తం కాలిపోయింది. సుదూర ప్రాంతం నుండి జీవనోపాధి కోసం నార్పలకు వచ్చిన వలస వ్యాపారులకు ఇలా జరగడంతో పలువురు స్థానికులు వారి శక్తి మేరకు ఆర్థిక సహాయం అందచేస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం వాకింగ్ బ్యాచ్ సభ్యులు స్పందించి 21వేల 500 రూపాయలను బాధితులకు ఆర్థిక సహాయం అందచేశారు. వ్యాయామాలు చేస్తూ వారి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవడమే కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అని మానవ సేవే మాధవ సేవా అన్న గొప్ప ఆలోచన వారికి రావడం అభినందనీయమని, వాకర్లు చేసిన ఈ ఆర్థిక సహాయం పట్ల పలువురు స్థానికులు ప్రశంసిస్తున్నారు. బాధితులు వాకింగ్ బ్యాచ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకింగ్ బ్యాచ్ సభ్యులు బేకరీ శేషు, కోళ్ల పీరా చికెన్ సెంటర్ నిర్వాహకులు జాఫర్, సురేష్, బయపురెడ్డి, సంజీవరెడ్డి, సయ్యద్ బాషా ఇలియాజ్, సలీం ఖాన్, టింకర్ భాషా, కుల్లాయప్ప, శంకర్ రెడ్డి ( రెడ్డి జ్యువెలర్స్) తదితరులు పాల్గొన్నారు.

➡️