నాగాటి నారాయణ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న యుటిఎఫ్ నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
యుటిఎఫ్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా, జెఎసి నాయకుడిగా పని చేసిన నాగాటి నారాయణ ఆశయాలను కొనసాగిస్తామని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిదరాజులు, లింగమయ్య పిలుపునిచ్చారు. నాగాటి నారాయణ 2వ వర్థంతి సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని యుటిఎఫ్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులిర్పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల శ్రేయస్సే పరమావధిగా ఉపాధ్యాయుల ఉన్నతి కోసం నారాయణ అనేక పోరాటాలు చేసారన్నారు. యుటిఎఫ్ అనేక పోరాటాలు చేసి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు చాలా మేలు చేసే సౌకర్యాలను ప్రభుత్వం నుంచి పోరాడి సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి యుటిఎఫ్ అనేక సమరశీల పోరాటాలు చేయడంలో, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడంలో ఆయన పాత్ర చాలా గొప్పదన్నారు. ఉపాధ్యాయులను, కార్యకర్తలను కదిలించడంలో విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ గౌరవాధ్యక్షులు రమణయ్య, సహాధ్యక్షురాలు సరళ, వివిధ మండలాల నాయకులు శ్రీనివాసులు, వీరేశ్వరాచారి, గంగాధర్, పవన్‌కుమార్ పాల్గొన్నారు.