ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే జెసి అస్మిత్‌రెడ్డి

ప్రజాశక్తి-పెద్దపప్పూరు

గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే జెసి.అస్మిత్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నయక్కలూరు, చెర్లపల్లి గ్రామాల్లో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. అందు లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా మన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తున్నామని, అధికారులు ప్రజల వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రధానంగా రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్నారన్నారు. చిన్నయక్కలూరు సభలో శ్మశానవాటిక, దోబీఘాట్‌కు స్థలం చూపాలని, భూ సమస్యలను వివరించారు. చర్ల్లపల్లిలో ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. గ్రామసభలో ఇళ్లకు సంబంధించి పొజిషన్‌ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. భూ సమస్యలు, పింఛన్లు, తదితర సమస్యలను విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ బాలాజీరాజు, ఎంపిడిఒ శకుంతలమ్మ, ఈఓఆర్డి సురేష్‌బాబు, ఎపిఒ గంగరాజు, ఎంఇఒ ఓబుళపతి, మండల ఇంజినీర్‌ ప్రసన్నకుమార్‌, టిడిపి సీనియర్‌ నాయకులు రామకృష్ణారెడ్డి, శశిధర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, అశ్వత్థరెడ్డి, సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, డీలర్‌ నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి, వెంకట శివారెడ్డి, చెన్నారెడ్డి, కుసుమారెడ్డి పాల్గొన్నారు.తూట్రాలపల్లెలో రెవెన్యూ సదస్సులుయాడికి : మండలంలోని తూట్రాళ్లపల్లె గ్రామంలో తహశీల్దార్‌ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. వివిధ భూ సమస్యలపై 40 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాసులు, ఆర్‌ఐ కిష్టప్ప, పంచాయతీ కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపిపి వేలూరు రంగయ్య, సర్పంచి సంజీవరాయుడు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️