దీక్షల్లో కూర్చొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, నాయకుల
ప్రజాశక్తి-అనంతపురం
ప్రయివేట్ కాంట్రాక్టర్లకు కాకుండా సొసైటీకే టెండర్ అప్పగించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం నగరంలోని ట్రాన్స్‌కో ఎస్‌ఇ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఇ కార్యాలయం జిల్లా స్టోర్స్ హమాలీలు 14 సంవత్సరాలుగా డిపిల లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్న కార్మికులకు టెండర్ ప్రాసెస్ ఇవ్వకుండా రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అనంతపురం జిల్లాలో ప్రయివేట్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2024లో జిల్లాలో కొందరు బయట కాంట్రాక్టర్లు లోడింగ్, అన్‌లోడింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల కంటే తక్కువ లెస్‌కు టెండర్ వేయడం వల్ల గతంలో వస్తున్న ఆదాయం కంటే తక్కువ వేతనం తీసుకున్నట్లు తెలిపారు. దీనివల్ల తమ కుటుంబాలు గడవడం కూడా గగనంగా మారిందన్నారు. ఈనేపథ్యంలో కార్మికులు ఏర్పాటు చేసుకున్న సొసైటీలకే పనులు అప్పగించాలని, లేనిపక్షంలో ఈనెల 5వతేదీ నుంచి లోడింగ్, అన్‌లోడింగ్ పనులను నిలిపివేయనున్నట్లు తెలిపారు. అనంతరం సూపరింటెండింగ్ ఇంజినీరు శేషాద్రికి వినతిపత్రం అందించారు. ధర్నాకు సిఐటియు నగర కార్యదర్శి ముత్తుజ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నబిరసూల్, మారుతీకుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధు, మహబూబ్‌బాషా మద్దతు తెలిపారు. ది డిస్ట్రిక్ట్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (సిఐటియు) అధ్యక్షులు గంగాధర్, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి ఎం.షమీర్‌బాషా, సంయుక్త కార్యదర్శి ఎస్‌ఎండి హజీవలి, కోశాధికారి కె.చెన్నకేశవులు, కార్మికులు పాల్గొన్నారు.