జీవో 36 ప్రకారం కార్మికులకు వేతనాలివ్వాలి

జీవో 36 ప్రకారం కార్మికులకు వేతనాలివ్వాలి

మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌

అనంతపురం నగర పాలక సంస్థ ఇంజినీరింగ్‌ అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని సిఐటియు నాయకులు కోరారు. ఈమేరకు గురువారం మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టిజి.భరత్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా కార్యదర్శి నాగేంద్ర, ఇంజినీరింగ్‌ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి విఎస్‌.రాయుడు, నగర అధ్యక్షులు ఓబుళపతి, ప్రధాన కార్యదర్శి మురళీమోహన్‌, కోశాధికారి ఎం.పోతులయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️