యువత మంచిని గ్రహించాలి

యువత మంచిని గ్రహించాలి

మాట్లాడుతున్న ఎసిడిపిఒ ఆగిశం నాగమణి

ప్రజాశక్తి-గుత్తి

యువత మంచిని మాత్ర మే గ్రహించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఎసిడిపిఒ ఆగిశం నాగ మణి సూచించారు. గురువారం మండ లంలోని కొత్తపేట గ్రామ సమీపంలో ఉన్న హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో చిల్డ్రన్స్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌, హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఫోక్సో చట్టం, ఆన్‌లైన్‌ వాడుకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల విద్యార్థులు సెల్‌ ఫోన్‌ వాడకం అధికమైందని దాని ద్వారా అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయన్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లో మంచిని మాత్రమే సేకరించాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు. అనంతరం లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్యం, బాలల హక్కులు అనే అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి అందులో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ సీఈవో నారాయణస్వామి, ఉపాధ్యాయుని విశాల, డిసిపియు పిఒ వెంటేశ్వరి, హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది భాగ్యలత, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️