ద్రాక్షారామ లో అంగన్వాడీ పిలుస్తుంది ర్యాలీ

Jun 20,2024 18:00 #Anganwadis, #Konaseema

ప్రజాశక్తి ‌- రామచంద్రపురం : మండలంలోని ద్రాక్షారామంలో గురువారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రాక్షారామ పరిసర ప్రాంతాల్లోని అంగన్వాడి సెంటర్ల టీచర్లు ఆయాలు హాజరై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిడిపిఓ వివి వరాహలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులను అంగన్వాడి సెంటర్లో చేర్పించాలని సెంటర్లలో ప్రీస్కూల్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించామని అదేవిధంగా వారికి ఆటలు పాటలు కూడా నేర్పుతారని, చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ జి సూర్యవతి, అంగన్వాడీ టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు, ఆయాలు పాల్గొన్నారు.

➡️