కుప్పం (చిత్తూరు) : కుప్పం ఐసిడిఎస్ ప్రాజెక్టు లో కనమనపల్లి అంగన్వాడి సెంటర్ లో డిపార్ట్మెంట్ కి సంబంధం లేని ఆమె వర్క్ చేయడం దారుణం అని చిన్నారుల భవిష్యత్తు తో ఆడుకోద్దని వారిపై చర్యలు తీసుకోవాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గంగరాజు మాట్లాడుతూ … ప్రాజెక్టు అధికారికి ఈ విషయం తెలిసినప్పటికి ఎవరూ అలా పని చేయడం లేదని ఆర్టీఐ చట్టం ప్రకారం అడిగిన సమాచారం కి తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. ఈ ప్రాజెక్టు లో జరుగుతున్న అక్రమాల్లో ఇది మచ్చుకు మాత్రమేనన్నారు. ఇలాంటి అక్రమాలు కోకొల్లలు గా వున్నాయని తెలిపారు. నూతన ప్రభుత్వం అంగన్వాడీల ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధం అయితే ఈ ప్రాజెక్టు లో అప్లై చేసిన వారి వివరాలు జిల్లా కు చేర్చలేదని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను జిల్లా పిడి దఅష్టి కి తీసికెళ్ళినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. ఇక్కడ పని చేస్తున్న వర్కర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
