అంగన్‌వాడీ కేంద్రాలు విద్యాభివృద్ధికి మూలాలు

ప్రజాశక్తి-కనిగిరి: అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆటపాటలతో కూడిన పౌష్టిక ఆహారం అందించనున్నట్లు కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని పాతూరులో ఉన్న మూడు అంగన్‌ వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించి అక్కడి పరిసరాల పరిశుభ్రత, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల పరిజ్ఞానాన్ని పరీక్షించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో విద్యాభివృద్ధి అద్భుతంగా ఉంటుందో ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగులో ఉంటుం దని చెప్పడానికి ఎలాంటి సందేహమూ లేదన్నా రు. ప్రభుత్వాలు విద్యాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పిల్లల శారీరక దారుఢ్యా న్ని పెంచేందుకు మంచి పోషకాహారాన్ని అంది స్తూ అలాగే చదువుకోవడం కోసం అన్ని సదుపా యాలు కల్పిస్తున్నాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టంగా తయారు చేసుకుంటే అవే విద్యాభివృద్ధికి మూలాలు అవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసరి మురళి, ఉపాధ్యాయురాల్లు రజిని, మల్లేశ్వరి, వెంకటరత్నం, ఆయాలు వనజ, సిలార్‌, పద్మ తదితరులు పాల్గొన్నారు.

➡️