ప్రజాశక్తి – గుడ్లవల్లేరు : అంగన్వాడీ వర్కర్స్ -హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో గురజాడ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరానగర్ లో జరిగిన సమావేశంలో సీఐటియు మండల అధ్యక్షురాలు మేకల జయలక్ష్మి, సెక్టార్ లీడర్ అమ్మాజీ, గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జయలక్ష్మి మాట్లాడుతూ .. తెలుగు భాష ఉన్నంతవరకు గురజాడని తెలుగు ప్రజలు మర్చిపోయే సమస్యేలేదని,అంతేకాకుండా ఆయన దేశమును ప్రేమించుమన్నా దేశభక్తి గీతం ఇప్పటికీ శిరోధార్యమని అన్నారు. కవుతరం చెరువు గట్టుపై ఉన్న సెంటర్ లో జరిగిన సమావేశంలో సెక్టర్ నాయకులు గరికిపాటి విజయలక్ష్మి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గురజాడ అడుగు జాడల్లోనే తాము పయనిస్తామని అన్నారు. అనంతరం నాయకులు బివిశ్రీనివాసరావు గురజాడపై కవిత చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు నాయకులు మౌనికగ్రేస్, రజని, ధనలక్ష్మి, మంజుల, దేవకరుణ, భవాని,వాణి, మంగమ్మ, జ్యోతి, నక్షత్రం, శివనాగలక్క్ష్మి, అనుపమ, స్వప్న, కౌతవరం నాయకులు సుజాత, మస్థాన్బీ, శైలజ, నవిత, చాముండేశ్వరి, భాగ్యలక్ష్మి, రజని, నాగమణి, మంగాయమ్మ, వెంకటేశ్వరమ్మ, తులసి, కుమారి, మల్లీశ్వరి, రాజకుమారి, శారద, సుభాషిణి, శశికుమారి,విజయకుమారి పాల్గొన్నారు.