అంగన్వాడీల ‘చలో విజయవాడ’ అడ్డగింత

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. నరసాపురం నుంచి విజయవాడకు రైల్లో వెళ్లేందుకు వచ్చిన అంగన్వాడీలను పోలీసులు అదుపులోనికి తీసుకుని స్టేషన్లోని వెయిటింగ్‌ హాల్లో కూర్చోబెట్టారు. ప్రభుత్వ చర్య పై అంగన్వాడీలు మండిపడుతున్నారు. వైసిపి ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కూటమి కూడా అనుసరిస్తుందంటూ మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ నేటికీ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేయటం దారుణమన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునేందుకు విజయవాడలో శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని తరలివెళుతుంటే తామందరినీ పోలీసులతో అడ్డుకోవడం సిగ్గు చేటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రైల్వే స్టేషన్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

➡️