చిత్తూరులో అంగన్వాడీల ధర్నా విజయవంతం

చిత్తూరు : అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిన్నటి రోజున బయలుదేరిన అంగన్వాడీలను అరెస్టులు చేయడం నిర్బంధించడం విజయవాడకు వెళ్లకుండా చూడడం ప్రజాస్వామ్యాన్ని కుని చేయడం లాంటిదని సిఐటియు ,ఎఐటియుసి జిల్లా నాయకులు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచివరం సురేంద్రన్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను ఇచ్చారు. అంగన్వాడీలు ధర్నాలు చేసే సందర్భంలో మేం ప్రభుత్వంలోకి వస్తే జీతాలు పెంచుతామని , అంగన్వాడీలకు న్యాయం చేస్తామని గొప్పగా హామీలు ఇచ్చి, ఆ హామీలను అమలు చేయమని కోరుటకు చలో విజయవాడ కార్యక్రమం పెట్టుకుంటే ఎక్కడ వారిని అక్కడ అంగన్వాడీ నిర్బంధించడం అరెస్టులు చేయడం ఇది సబబా అని సురేంద్ర ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఓడ మల్లయ్య ఓడ మల్లయ్య అని చెప్పి, గెలిచిన తర్వాత పోరాబోడి మల్లయ్య అన్నట్టు ఉందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ఉసురు పోసుకోకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించుటకు ప్రయత్నం చేస్తారని అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు బందు కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చంద్రబాబు గారినీ హెచ్చరించారు. ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను కరివేపాకు లాగా వాడుకోవడం దురదఅష్టకరమన్నారు, కనీస వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, ఇలా అనేక రకాల సమస్యలను ప్రభుత్వం దఅష్టికి తీసుకునే వెళ్లడానికి చలో విజయవాడ కార్యక్రమం పెట్టుకుంటే అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు అయ్యేలాగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంగన్వాడి యూనియన్‌ సిఐటియు నాయకురాలు ఓహెచ్‌ సుజిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్‌ గౌరవాధ్యక్షులు వి గంగరాజు ఏఐటీయూసీ జిల్లా నాయకులు నాగరాజన్‌, రమాదేవి, దాసరి చంద్ర, మనీ, అనిత , జయంతి తదితరులు పాల్గొన్నారు.

➡️