నరసరావుపేట ఎంపి అభ్యర్థిగా అనీల్‌ కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు….

Apr 24,2024 15:12 #anial kumar yadav, #nomination, #YCP

ప్రజాశక్తి-పల్నాడు : సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పల్నాడు జిల్లాలో 6వ రోజైన బుధవారం నరసరావుపేట వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థిగా అనీల్‌ కుమార్‌ యాదవ్‌ తరపున ఆయన భార్య జాగృతి, వైసిపి సీనియర్‌ నాయకులు గజ్జల బ్రహ్మారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శివ శంకర్‌ లోతేటికి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఎన్నికల సిబ్బంది నామినేషన్‌ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.

➡️