దాతల సహకారంతో అన్న క్యాంటీన్‌

Oct 1,2024 21:54
ఫొటో : ఎంఎల్‌ఎకు చెక్కు అందజేస్తున్న దాతలు

ఫొటో : ఎంఎల్‌ఎకు చెక్కు అందజేస్తున్న దాతలు
దాతల సహకారంతో అన్న క్యాంటీన్‌
ప్రజాశక్తి-వింజమూరు : మండలంలోని దాతల సహకారంతో అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నామని ఉదయగిరి ఎంఎల్‌ఎ కాకర్ల సురేష్‌ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం వింజమూరులో దాతల సహకారంతో అన్నా క్యాంటీన్‌ ప్రారంభించామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తమ కాకర్ల ట్రస్ట్‌ ద్వారా అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నామని ఇకనుండి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో నుంచి దాతల సహకారంతో క్యాంటీన్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అందులో భాగంగానే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు సాకలకొండ గ్రామంలోని ప్రజల సహకారంతో ఈ నెలరోజుల పాటు అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంటీన్‌లో ప్రజల భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతున్నామన్నారు. కావున మండల పరిధిలోని దాతలు ముందుకొచ్చి అన్న క్యాంటీన్‌ బాధ్యతలు తీసుకోవాలని ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలని కోరారు. కాకర్ల టెస్ట్‌ అన్న క్యాంటీన్‌కు ఎన్నారై నుంచి కూడా చాలామంది దాతలు ముందుకొచ్చి నిధులు సమకూర్చాలని వారి నిధులను కూడా తాము ఉపయోగిస్తున్నామని గుర్తు చేశారు. తమ కాకర్ల ట్రస్ట్‌ ద్వారా ఇంకా ప్రజాపకరమైన సేవా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ గొంగటి రఘునాథరెడ్డి, టిడిపి సీనియర్‌ నాయకులు దొంతులు వెంకటేశ్వరరావు, సిహెచ్‌ వెంకటేశ్వర్లు, సుదర్శన్‌ రెడ్డి, చాగలకొండ కె.వి.ఆర్‌, టిడిపి సీనియర్‌ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

➡️