ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం చిత్తూరు : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానంకి అనుసంధానమైన శ్రీ వేణుగోపాలస్వామి (సంతాన ప్రదాత) స్వామివారి ఆలయం ప్రాంగణంలో రథసప్తమి సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఎస్ఆర్ పురం వాట్ షెడ్ మాజీ చైర్మన్ గుణశేఖర్ నాయుడు కుటుంబ సభ్యులు నిర్వహించారు. మంగళవారం ఎస్ఆర్ పురం మండలంలోని కటిక పల్లి గ్రామపంచాయతీ పిల్లి గుండ్లపల్లి గ్రామ వాస్తవ్యులు పంగులూరు మోహనమ్మ, గుణశేఖర్ నాయుడు దంపతులు, కుమారులు గిరిబాబు నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
