విచ్చల విడిగా నీటి వ్యాపారం

జిల్లా కేంద్రమైనా నీరు కొనాల్సిందే
అదుపులో లేని ధరలు
ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు
ప్రజాశక్తి – రాయచోటి
రాయచోటి జిల్లా కేంద్రమైనా కొన్నేళ్ల నుంచి ప్రజలు తాగునీ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం ఇబ్బం దులు తప్పడం లేదు. డబ్బులు పెట్టి నీరు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్‌ పరిధిలో 34 వార్డులున్నాయి. మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు దాదాపు 42 ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ప్లాంట్‌కూ అనుమతులు లేవు. పట్టణంలో 25 వేల గహాలు, లక్షకు పైగా జనాభా ఉన్నారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేసినా తాగునీటి సమస్యతో ప్రజలు ఇ బ్బందులు పడుతూనే ఉన్నారు. నీటి సమస్యపై శాశ్వత పరిష్కారం ఆలోచించే ప్రజా ప్రతినిధి కానీ, అధికారులు కానీ లేరని పలువురు విమర్శిస్తున్నారు. పట్టణ ప్రజల అవసరాల కోసం వెలిగల్లు ప్రాజెక్టు నుంచి గతంలో నాలుగు, ఐదు రోజులకు ఒక్కసారి నీటిని సరఫరా చేశారు. ప్రస్తుతం ఏడు, ఎనమిది రోజులకు ఒక్కసారి సరఫరా చేస్తున్నారు. అదీ ఒక గంట మాత్రమే వదలడంతో అవి చాలక పోవడంతో వాటర్‌ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ సచివాల యాల వద్ద సంబంధిత అధికారులకు విన్నవించుకుంటూ నిరసనలు చేపడుతున్నారు. వచ్చే నీటిని గంటపాటు కాకుండా మరికొంత సమయం ఎక్కువగా వచ్చేలా చూడాలంటూ వేడుకుంటున్నారు. అది కూడా ఏ సమయంలో వదులుతారో తెలియని పరిస్థితి. నీటిని ఒకే సమయంలో వదలాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి రాయచోటి ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పార్టీలు న్నికల ముందు తాగునీటి సమస్యపై హామీలిచ్చి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన తరువాత ఆ సమస్యను గాలికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం 20 లీటర్ల క్యాన్‌ రూ.15, 25 లీటర్ల క్యాన్‌ రూ. 20, బిందె రూ.15, కూల్‌ వాటర్‌ క్యాన్‌ రూ.40 చొప్పున నీటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా రాయచోటిలో కొనసాగుతుంది. మినరల్‌ వాటర్‌ను చిన్నచిన్న వాహనాల్లో స్టీల్‌ డ్రములతో ఉంచుకుని విధుల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే తాగునీటి కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఉద్యోగాలకు వెళ్లేవారు, వ్యాపారాలు చేసుకునేవారు, కూలీలు చేసుకునేవారు తప్పని సరిగా నీటిని కొనుగోలు చేసి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి రాయచోటి ప్రాంతంలో నెలకొంది. గతంలో రూపాయి ఇచ్చి తాగునీటి ప్యాకెట్లను కొని తాగేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ నిషేదించడంతో రైతులు, వ్యాపారులు బయట ప్రాంతాల నుంచి వచ్చి దాహార్తిని తీర్చుకోవాలంటే రూ.పది పెట్టి తప్ప నిసరిగా అర లీటర్లు బాటిల్‌ కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవి వచ్చిందంటే తాగు నీటి సమస్య ఈ ప్రాంతంలో తీవ్రంగా ఉంటుంది. గతంలో తాగునీటి సమస్య ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు ట్యాంకర్లతో వీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం గుక్కెడు నీరు ఉచితంగా ఇచ్చే పరిస్థితి పట్టణంలో ఎక్కడ కనిపించడం లేదు.జిల్లాగా ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా … రాయచోటి జిల్లాగా ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ మౌలిక వసతులు లేకపోవడం గమనార్హం. దీనికి తోడు రాయచోటిలో నీటి వ్యాపారం మరింత ఊపందుకుంది. మున్సిపల్‌ అధికారులు అనుమతులు లేని మినరల్‌ వాటర్‌ ప్లాంట్లపై శ్రద్ద తీసుకోకపోవడంలో అంతర్యం ఏమిటి అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా నీటి వ్యాపారం జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా ప్లాంట్‌ వద్దకు వెళ్లి సక్రమంగా మినరల్స్‌ నీటిని శుద్ధి జరుగుతుందా, లేదా అని గమనించిన పాపన పోలేదు. కొందరు ఏకంగా మినరల్‌ వాటర్‌ పేరు చెప్పి బోర్ల వద్ద నీటిని నింపుకొని ఆ నీటిని ప్రజలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రజలు మినరల్‌ వాటర్‌ అని నమ్మి వారిచ్చే నీటిని కొని తాగుతున్నప్పటికీ కొందరు అనారోగ్యాల గురవుతున్నట్లు సమాచారం. 33వ వార్డులో పైపు లైనే లేదు.. మున్సిపల్‌ పరిధిలో 33వ వార్డులో ఇప్పటి వరకు వెలిగెల్లు ప్రాజెక్ట్‌కు సంబంధించిన పైపు లైన్‌కు ఇప్పటి వరకు సరఫరా అందించక పోవడం శోచనీయం. ఈ వార్డులో ఇందిరమ్మ కాలనీలో 450, గొల్లపల్లి 250, ఎగువ అబ్బవరంలో 80 కుటుంబాలు నివాసం ఉన్నారు. తాము మున్సిపాల్టీకి సంబంధించిన అన్ని పనులు కడుతున్నామని, కానీ తమ ఇంటి దగ్గరికి వెలిగల్లు నీరు ఇంతవరకు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం లో ఎక్కువగా కూలీ చేసుకునేవారే ఉన్నారు. రోజూ డబ్బులు పెట్టి తాగునీరు కొనాలంటే ఇబ్బంది పడుతున్నారు. నాయకులు కానీ, అధికారులు కానీ, ఏ ఒక్కరూ ఆలోచించిన పాపాన పోలేదు. ఇప్పటికైనా తాగునీటి ధరలకు నియంత్రణ చేసి, అనుమతులు లేని వాటర్‌ ప్లాంటు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.తాగునీటి ధరలను నియంత్రించాలి.. శుద్ది చేసిన వాటర్‌ ప్లాంట్‌లో నీటి ధరలను మున్నిపల్‌ అధికారులు వెంటనే నియంత్రించాలి. వెలిగల్లు నీటి సరఫరా చేయకముందే ముందే ప్రజలకు చేరువ చేయాలి. నిత్యం ఉపయోగించే వెలిగల్లు నీటిని రెండు రోజులకు ఒకసారి వదలాలి. -డి.సి.వెంకటయ్య, స్థానికుడు, ఇందిరమ్మ కాలనీ, రాయచోటి. తమ దష్టికి రాలేదు.. మున్సిపాలిటిలో నేను ఈ మధ్యకాలంలోనే కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. వాటర్‌ ప్లాంట్‌ అన్ని పరిశీలించి సక్రమంగా శుద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. వాటర్‌ ప్లాంట్‌ ద్వారా తాగునీటిని అధికరేట్లకు సరఫరా చేస్తున్నారని ప్రజలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం.త్వరలో పట్టణంలోని అన్ని ప్లాంట్‌ను పరిశీలిస్తాం.-వాసు బాబు, మున్సిపల్‌ కమిషనర్‌, రాయచోట

➡️