ప్రాంగణ ఎంపికలలో 27 మందికి ఉద్యోగాలు

Apr 1,2024 14:43 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయినపల్లిలోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో ఎంఎస్ఎన్ లాబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిచే నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 27 మంది విద్యార్థులు ఎంపికై ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.స్వర్ణలత తెలియజేశారు. ఎం ఎస్ ఎన్ లాబరేటరీ హెచ్ఆర్ బృందం ఆంటోనీ జోషి, టాలెంట్ యాక్విజేషన్ టీం మరియు హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ అభిరామ్ లు సోమవారం అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో డాక్టర్ పి.ద్వారకానాధ రెడ్డి ఆధ్వర్యంలో అర్హత కలిగిన 100 మంది విద్యార్థులు రాత పరీక్ష మరియు హెచ్ఆర్ రౌండులో పాల్గొనగా 27 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. తమ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం ఏడాదిలో ఇది ఐదవ సారి అని, విద్యార్థులు ఉద్యోగాలు సాధించి భవిష్యత్తుకు బాటలు వేసి సహకరించిన కళాశాల నియామక బృందం నరసింహులు, డాక్టర్ ఎం.శిరీష, ఎం.హంస బేగ్, మహేంద్రలను ప్రిన్సిపాల్ అభినందించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల కార్యదర్శి చొప్ప గంగిరెడ్డి, కోశాధికారి అభిషేక్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎల్లారెడ్డి, చైర్మన్ రామచంద్రారెడ్డి అభినందించారు.

➡️