ఏకలవ్య అకాడమీలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్

Jun 8,2024 12:56 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఏకలవ్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నందు శనివారం మాస్టర్లు ఆర్.ఎన్ రెడ్డి ప్రవీణ్, ఉద్దండపు బాలాజీ ల ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో పదిమంది క్రీడాకారులు ఎల్లో బెల్టు, ఐదు మంది గ్రీన్ బెల్టు, ఒక క్రీడాకారిణి రెడ్ బెల్ట్ నందు ఉత్తీర్ణత సాధించినట్లు మాస్టర్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చెన్నూరు సునీల్ కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఓబులేసు పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అంటే సామర్ధ్య పరీక్ష అని, ఇందులో క్రీడాకారులు తమ సామర్థ్యంతో పాటు ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి సర్టిఫికెట్లు, బెల్టులు అందజేయడం జరుగుతుందని వివరించారు. టైక్వాండో సాధనతో ఆత్మ రక్షణ మాత్రమే కాక ఆరోగ్యవంతులుగా ఉంటూ నిత్యం ఆత్మవిశ్వాసంతో మెలగుతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడా కోటా ద్వారా ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. విద్యార్థులు కఠోర సాధన చేసి ఒలంపిక్ స్థాయికి ఎదిగి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని రావాలని సూచించారు. అనంతరం ఉత్త్తీర్ణత సాధించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు పి.శివ కుమార్, ఏ.వికాస్, కె.ఎల్ భార్గవి, కె.ఎల్ జ్వలిత లక్ష్మి, డి.అక్షయ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️