గుండ్లూరులో సి.సి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చామర్తి జగన్మోహన్రాజు తెలియజేశారు. రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ పట్టణాలతో సమానంగా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని గుండ్లూరు గ్రామపంచాయతీ నందు పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆదివారం సి.సి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లెను అభివృద్ధి దిశగా నడిపించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇప్పటికే కోట్లాది రూపాయలతో గ్రామాలలో రోడ్ల నిర్మాణం కొనసాగుతుందని, ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరికి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పల్లెను అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసి నిధులను రాబడతానని, అందరి కృషి, సహకారంతో రాజంపేటను అభివృద్ధి దిశగా నడిపిస్తానని ఆయన తెలియజేశారు. అంతకుముందు గ్రామంలో పర్యటించిన ఆయనకు గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గన్నే సుబ్బనసయ్య నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, పోలి చెరువు సంఘం చైర్మన్ నాగేశ్వర్ నాయుడు, నందలూరు మండల క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, రాజంపేట క్లస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డయ్య నాయుడు, మాజీ మండల అధ్యక్షులు బాపనయ్య నాయుడు, కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, సంగరాజు వెంకటరమణ రాజు, పార్లమెంట్ తెలుగుయువత అధికార ప్రతినిధి జగదాభి పాండురాజు, బండారు రెడ్డి శేఖర్ గౌడ్, యువ నాయకులు తేజాల ఆనంద్, జూటూరు చిన్ని కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.