ప్రజాశక్తి – రామసముద్రం : పిడుగుపాటుకు గురై రెండు పాడిపశువులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో ఆదివారం తెల్లవారుజామున పడిన వర్షం కారణంగా ఆర్.నడింపల్లి పంచాయతి దిగువబొంపల్లి గ్రామానికి చెందిన సుశీలమ్మకు చెందిన రెండు పాడి పశువులు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. కుటుంబం పోషణకు వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉన్న రెండు పాడిపశువులు మృతి చెందడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను కోరుకుంటున్నారు. పాడిపశువులు విలువ సుమారు లక్షా యాభై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు.