వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందజేత

Jun 9,2024 12:26 #Annamayya district

ప్రజాశక్తి-బి.కొత్తకోట :  బి.కొత్తకోట కు చెందిన పెయింటర్ లక్ష్మీనారాయణ కు వైద్య ఖర్చుల కొరకు బి.కొత్తకోట హార్డ్ వేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. బి.కొత్తకోట కు చెందిన పెయింటర్ లక్ష్మీనారాయణ కు గత కొన్ని రోజుల క్రితం తన కాలును తొలగించడంతో తన ఆర్థిక పరిస్థితిని గమనించిన బి.కొత్తకోటకు చెందిన హార్డ్వేర్ అసోసియేషన్ సభ్యులు మానవత్వం చాటుకొని వారి తరఫునుండి పదివేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వెంకటరెడ్డి, ధర్మ, శ్రీనివాసులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

➡️