ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభం 

Feb 11,2024 11:18 #Annamayya district, #inter
inter practicals start

ప్రజాశక్తి- కలకడ : మండల కేంద్రమైన కలకడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ ఎం రమణయ్య తెలిపారు. మండలంలోని మోడల్ కళాశాల, సాయి జూనియర్, కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు అని తెలిపారు. ఈనెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరుగు ప్రాక్టికల్స్ కు మూడు కళాశాల నుండి 82 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రాక్టికల్స్ ను కట్టుదిట్టమైన చర్యల మధ్య నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

➡️