-ఫౌండర్ సుమతి రెడ్డిని సన్మానించిన కలికిరి జేఏసీ నాయకులు
ప్రజాశక్తి-కలికిరి: రెడ్డి జాతికే గర్వకారణం రెడ్డి రాజులు అని భక్తమల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ ఎనిమిదవ వార్షికోత్సవానికి కలికిరి నుండి రెడ్డి జేఏసీ అధ్యక్షుడు ధరణి సత్యారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు అధిక సంఖ్యలో తిరుపతికి తరలి వెళ్లారు. ఆదివారం తిరుపతిలో బి ఎం జి ఆర్ ఎఫ్ ఎనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నలుమూలల నుండి విచ్చేసిన రెడ్డి కుటుంబ సభ్యుల సమన్వయంతో ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమం సాగింది. వివిధ రంగాలలో రెడ్డి కుటుంబ సభ్యులు సాధించిన ఘనతను వారి జీవన శైలిని భవిష్యత్తు రెడ్డి జాతికి మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఐక్యమత్యంతో భవిష్యత్తులో మరింత బలోపేతం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సంగీత, నృత్య కలలు అలరించాయి. కలికిరి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బి ఎం జి ఆర్ ఎఫ్ ఫౌండర్ సుమతి రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లాయర్ రాంప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ ఆదినారాయణ రెడ్డి, రాజారెడ్డి , శివారెడ్డి, నరసింహారెడ్డి, కాంట్రాక్టర్ శేషుకుమార్ రెడ్డి, సర్పంచ్ శేషాద్రి రెడ్డి, నారాయణరెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామిరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టీచర్ రామకృష్ణారెడ్డి, శశి కుమార్ రెడ్డి, బాబు రెడ్డి, కసిరెడ్డి ప్రతాపరెడ్డి రెడ్డి, తపాలా శాఖ జయరాం రెడ్డి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.
