ఖాది, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా కేకే చౌదరి 

Nov 9,2024 16:01 #Annamayya district

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : ఆంధ్రప్రదేశ్ ఖాది, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ గా చిట్వేలి మండలం టిడిపి అధ్యక్షులు కేకే చౌదరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కేకే చౌదరి చిట్వేల్ మండలంలో టిడిపి బలోపేతానికి కృషిచేసి గత ఎన్నికలలో కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ విజయానికి ఎంతో కృషి చేశారు,అంతేకాకుండా వైసిపి పాలనలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో లోకేష్ కు వెన్నుదన్నుగా నిలిచారు. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును వైసిపి ప్రభుత్వం అక్రమ కేసుల పనయించి జైలుకు పంపిన సమయంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రలో కేకే చౌదరి పాల్గొని సహాయ సహకారాలు అందించారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కేకే చౌదరి కృతజ్ఞతలు తెలియజేశారు.

➡️