భూ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి 

Apr 3,2024 11:30 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: భూ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలని కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడల్ చంగల్ రాయుడు పేర్కొన్నారు. బుధవారం స్థానిక పాఠశాలలో సేవ్ ఎర్త్-సేవ్ ఎనర్జీ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పఠశాల కోనలో  ప్రధానోపాధ్యాయులు మోడెమ్ చెంగల రాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భూమి మీద ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. వీలైనంత ఎక్కువగా చెట్లను పెంచాలని, కరెంటు వినియోగంలో ఆదా పద్ధతులను పాటించాలని, ఇండ్లలో ఎల్ఈడి బల్బులు వినియోగించాలని సూచించారు. సేవ్ ఎనర్జీ సేవ్ ఎర్త్ లో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు ఎస్సే రైటింగ్ నిర్వహించి బహుమతులను అందజేయడం జరిగింది. గ్రామంలో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లు నాటుదాం భూమిని కాపాడుదాం, భావితరాల కోసం కరెంటు ఆధా చేద్దాం నినాదాలతో ర్యాలీ నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివారెడ్డి నాగమన్ నాయక్ సైరాబాను షౌకత్ అలీ నౌషాద్ బేగం కిరణ్, శ్రీదేవి, ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు.

➡️