చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చిన నాయకులు

Apr 12,2025 13:23 #Annamayya district

ప్రజాశక్తి-చిట్వేలి: ఎం.రాచపల్లిలో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనపై రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఖాదీ బోర్డు స్టేట్ చైర్మన్ కేకే చౌదరి, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అరవ శ్రీధర్, విషాదాన్ని వ్యక్తం చేశారు. చిన్నారులు చొక్కా రాజు దేవా (తండ్రి: నరసింహ రాజు,వయస్సు 7సంవత్సరాలు) , చొక్కా రాజు జయ (7), రెడ్డిచెర్ల యశ్వంత్ (తండ్రి: వెంకటేష్, వయస్సు: 7 సంవత్సరాలు) నీటి కుంటలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన విషాదకర సంఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఆడుకుంటూ నీటి కుంటలోకి వెళ్లిన ముగ్గురు చిన్నారులు లోతు ఊహించని స్థాయిలో ఉండటంతో మునిగి ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని అన్నారు. వెంటనే గ్రామస్థులు స్పందించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు మరణించారని డాక్టర్లు ధృవీకరించారన్న సంగతి దురదృష్టకరమని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయాన్ని అందించి, వారి వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పరిశీలించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట సీఐ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్సై రఘురాం ఉన్నారు .

➡️