ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాళ్యం గ్రామం సమీపంలోని అడవిలో ఓ చిరుత ఉచ్చులో చిక్కుకుంది. రైతులు తమ పంట పొలాలను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన ఉచ్చులో ఈ చిరుత చిక్కుకొని గంటల తరబడి నరకయాతన అనుభవించింది. బుధవారం ఉదయం పొలాలకు వచ్చిన రైతులు చిరుతను కనుక్కొని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. రాత్రి నుంచి ఉచ్చులో చిక్కుకున్న చిరుతను బయటకు తీసేందుకు ఫారెస్ట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎఫ్ ఆర్ వో జయ ప్రసాద్ రావు, సబ్ డి ఎఫ్ ఓ శ్రీనివాసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు సుమిత, జయరాం, ఉమాదేవిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
