ప్రజాశక్తి – నందలూరు: ప్రధానమంత్రి మాతా సురక్షిత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ శరత్ కమల్, డాక్టర్ విశ్వనాథ్ తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ గర్భవతులకు బిపి ,రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 29 మంది గర్భవతులను గైనకాలజిస్ట్ డాక్టర్ మస్తానమ్మ స్కానింగ్ నిర్వహించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాయల్ సేవా సమితి అధ్యక్షులు గంగనపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పేషెంట్స్ కొరకు 300 ఓపి బుక్కులు వైద్యాధికారులకు అందజేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ఆశా కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వెంకటనారాయణ, సూపర్వైజర్ సునీల్ కుమార్, ఎం ఎల్ హెచ్ పి లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
