మెరుగైన ప్రజా ఆరోగ్య సేవే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

ప్రజాశక్తి-నిమ్మనపల్లె రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సేవలో, రాష్ట్ర అభివద్ధిలో నిమగమై ఉందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. శుక్రవారం నిమ్మనపల్లి మండలంలో ఆయన పర్యటిస్తూ పలు అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణంలో ప్రజా ఆరోగ్య సేవ నిమిత్తం రూ.50 లక్షల నిధులతో నిర్మించదలచిన మెడికల్‌ ల్యాబ్‌ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే స్థానిక నాయకులు అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కషి చేస్తోందని అన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు, మురుగనీటి కాలువల నిర్మాణం చేపట్టామని, పశువుల దాహార్తిని తీర్చడానికి నీటి తొట్టెల నిర్మా ణాన్ని చేపట్టామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉందని, ఇక్కడ ప్రతిరోజు 120కి పైగా రోగులు ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు. రోగులు వైద్య పరీక్షల నిమిత్తం వాల్మీకిపురంకు, మదనపల్లెకు వెళ్లాల్సి వస్తోందని, వారికి మెరుగైన వైద్య సేవలు అందిం చడానికి ఆసుపత్రి ఆవరణంలో మెడికల్‌ ల్యాబ్‌ నిర్మించడానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణ పనులను ప్రారంభించి వీలైనంత త్వరగా ప్రజలకు మెడికల్‌ ల్యాబ్‌ ను అందుబాటులోకి తెస్తా మన్నారు. నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్క డాక్టరు, కేవలం ముగ్గురు స్టాఫ్‌ నర్సులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారని వెంటనే అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఒను కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక సెక్యూరిటీ గార్డును వెంటనే నియమిం చాలని ఎంపిడిఒ పరమేశ్వర్‌ రెడ్డిని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రెడ్డప్పరెడ్డి, ఆర్‌జె.వెంకటేష్‌, రాజన్న, సుధాకర్‌రావు, మల్లికార్జున, శ్రీపతి, దేవేంద్రరెడ్డి, సర్పంచులు పాపులమ్మ మల్లప్ప, సుబ్రమ ణ్యం, శ్రీవాణి నవీన్‌, ఆర్‌అండ్‌బి ఇఇ అరవింద దేవి, డిఇఇ సూర్యనా రాయణరెడ్డి, ఎఇ బుర్రయ్య, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రత్యూష, ఎంపిడిఒ పరమేశ్వర్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ రాంప్రసాద్‌, ఎపిఒ రమేష్‌ పాల్గొన్నారు.

➡️