నాదెండ్ల మనోహర్ ను కలిసిన ముక్కా, ఎమ్మెల్యే శ్రీధర్ 

Jun 10,2024 16:52 #Annamayya district

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి శాసభసభ్యులు నాదెండ్ల మనోహర్ ను రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానందరెడ్డి,తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి, రైల్వే కోడూరు జనసేన శాసనసభ్యులు అరవ శ్రీధర్ తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన మాట ప్రకారం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను గెలిపించి మాట నిలబెట్టుకున్నామని రూపానందరెడ్డి మనోహర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాగేంద్ర, నరసింహరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, గౌతమ్ రాజు, జోగినేని మణి, పగడాల చంద్రశేఖర్, వెంకటేష్, నాగరాజా కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️