బ్రిటిష్ వాళ్లకి సింహ స్వప్నం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 

Jan 23,2025 13:01 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: బ్రిటిష్ వాళ్లకి సింహ స్వప్నంలా వారి గుండెల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిలిచారని కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడం చంగల్ రాయుడు పేర్కొన్నారు. గురువారం మండలంలోని కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని బ్రిటిష్ వాళ్ళకి సింహ స్వప్నం లాగా మారారని విద్యార్థులు ఉద్దేశించి కొనియాడారు. బ్రిటిష్ వాళ్లని గడగడ లాలించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని, భారత స్వాతంత్రం కోసం నిస్వార్థంగా కృషి చేసినటువంటి వ్యక్తని వారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశ సమగ్రత ఐక్యతలను కాపాడడానికి ఎప్పుడూ ముందు ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్వరి, నాగ ముని నాయక్, రమేష్ కుమార్ రెడ్డి, రెడ్డప్ప, షౌకత్అలీ గఫార్ ఖాన్, సైరా భాను, నౌషాద్ బేగం, ఝాన్సీ రాణి, కిరణ్ కుమార్, శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు.

➡️