బిసిజి టీకాపై ప్రజలకు అవగాహన 

Jun 8,2024 15:52 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: బీసీజీ టీకాపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మండెం వారి పల్లి, డి.గొల్లపల్లిలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు వర్గాలవారు తప్పనిసరిగా టి.బి.వ్యాధి రాకుండా బి.సి.జి.టీకా చేసుకోవాలి అని ఆయన కోరారు. క్షయ(టి.బి)వ్యాధి లేని భారతదేశం యొక్క లక్ష్య సాధన కొరకే వయోజన బి.సి.జి.టీకాలు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినదని ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్ రఫీ మరియు టి.బి.పర్యవేక్షకులు నాగిరెడ్డి మరియు ఆరోగ్య విస్తరణ అధికారి జయరామయ్య అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆదేశాల మేరకు పెద్దల బి.సి.జి.టీకా ప్రాముఖ్యతపై ఎర్రకోట పల్లి వైద్యాధికారి డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో టీ.బి రాకుండా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వయోజన బిసిజి టీకా టీబి మరణాల తీవ్రతను నివారించడంలో బీసీజీ టీకా చాలా సురక్షితమైనదని, క్షయకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని మరింత పెంచడానికి మరియు పెద్దలలో టీ.బీ నుండి రక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజన కారి అని ఎవరు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా వేసుకోవచ్చునని, 60 సంవత్సరాలుపై బడ్డ వయసు, పొగపీల్చువారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు(18 సం నుండి 60 సం లోపు), టిబి జబ్బుతో కోలుకున్న వారు,వారి కుటుంబ సభ్యులకు, 18 కంటే వయస్సుకు తగ్గ బరువు ఉన్నవారు, వీరు టీకా కు అర్హులని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో నినాదాలు చేస్తూ ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, ఆరోగ్య విస్తరణ అధికారి జయరా  మయ్య,టి.బి.పర్యవేక్షకులు నాగిరెడ్డి ,పి.హెచ్.ఎన్. సుబ్

➡️