ఆరోగ్య పరీక్షలతో సురక్షిత మాతృత్వం సాధ్యం

Jun 10,2024 14:18 #Annamayya district

డాక్టర్ కిశోర్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి-కలకడ: ఆరోగ్య పరీక్షలతో సురక్షిత మాతృత్వం సాధ్యమవుతుందని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్భిణిస్ట్రీ యొక్క మేలైన ఆరోగ్యానికి, శిశువు ఎదుగుదలకు ఆరోగ్య పరీక్షలు ఎంతో దోహదం చేస్తాయని, గర్భిణిస్ట్రీలకు సూచించారు. ప్రతీ మహిళకు కాన్పు పునర్జన్మ మాదిరి అని అన్నారు. మెరుగైన ఆరోగ్య సేవలు అందిపుచ్చుకుని ప్రతి గర్భిణిస్ట్రీ సురక్షిత మాతృత్వం అలవర్చుకోవాలి. అందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానం, మీ ఊర్లో చక్కటి అవకాశమని బరువు, ఎత్తు, అధికరక్తపోటు, మూత్ర, రక్త, మొదలగు వ్యాధుల నిర్దారణ పరీక్షలు తమ ఆరోగ్య బృందంతో నిర్వహించి అవరమైన వారికి ఐరన్ఫోలిక్యాసిడ్, కాల్షియమ్, మరియు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేసి, ఆసుపత్రిలో కాన్పు ఆవశ్యకతను గూర్చి సూచన సలహాలు ఇచ్చారు. మొత్తం గర్భిణీ స్త్రీ లు 45హాజరు కాగా ఇందులో కష్టమైన గర్భిణీ స్త్రీ లు 08 మందిని గుర్తించి ఉన్నత స్థాయిప్రాథమిక ఆరోగ్య కేంద్రంలకు రిఫరల్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జవహర్ బాబు, ఎమ్.పి. హెచ్.ఇ,.ఓ.జి. జయరామయ్య, స్టాఫ్ నర్స్ జె. భారతమ్మ పి.హెచ్. ఎన్. సుబ్బరత్న. బండి రెడ్డెమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ షేక్ జమీల్ అహ్మద్ ఫార్మసిస్టు షేక్ షరీఫ్ బాషా, ఏ యన్ యంలు,ఆరోగ్య కార్యాకర్తలు. న్. వాణి. పి. శ్రీ లక్ష్మి. డి. వరలక్ష్మి. బి. లక్ష్మి. వి. రమణమ్మ సి. లక్ష్మి దేవి ఎమ్.ఎల్.హెచ్.పి లు, ఏ. రాజసులోచ. బి. అశ్వని. కె. కనకమ్మ. జె. ఎస్. గోపి కృష్ణ. ఎస్. లావన్య, ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

➡️