జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోన విద్యార్థులు ఎంపిక 

Jan 8,2025 12:53 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు మోడెమ్ చెంగల్ రాయుడు తెలిపారు. గత సంవత్సరం రాజమండ్రి విజయవాడలో జరిగినటువంటి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మిడపల యోగేశ్వర్, షేక్ సమీరా జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. వీరు జనవరి 10 నుండి తెలంగాణలోని మహబూబ్ నగర్ లో జరిగే జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో ఆడనున్నట్లు తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ ఆకుల ఝాన్సీ రాణిని, ఎంపికైన విద్యార్థులను, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.

➡️