8 గంటలకే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు

Mar 1,2024 11:32 #Annamayya district

ప్రజాశక్తి-పీలేరు : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతుండడంతో విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు కొందరు తమ పిల్లలతో కలిసి వచ్చి పరీక్షా కేంద్రంలో వారికి కేటాయించిన గదులను వెతుకులాడడం గమనార్హం. పీలేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల కళాశాల, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ మేధ జూనియర్ కళాశాల్లో మొత్తం 5 చోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒకరిద్దరు విద్యార్థులు హాల్ టికెట్లలో తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల గుర్తించుకోవడంలో ఆలస్యం కావడంతో ఆందోళన చెందారు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు కూడా గదుల కేటాయించిన విషయంలో తికమక పడాల్సిన పరిస్థితి నెలకొంది.

➡️