మదనపల్లెలో నవ వధువు అనుమానాస్పద మృతి

ప్రజాశక్తి – మదనపల్లె అర్భన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె బాబు కాలనీ, వెంకటేశ్వర పురంలో వివాహిత అనుమానస్పదస్థితిలో మృతి చెందడం బుధవారం కలకలం రేపుతోంది. వెంకటేశ్వర పురంలో ఉంటున్న శ్రీనివాసులు, ఉష దంపతుల కుమారుడు మణికంఠ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రామ్ నగర్ కు చెందిన వెంకటరమణ, లక్ష్మిదేవి ల కుమార్తె సాయిప్రియ (20) లు ఆరు నెలలక్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి గొడవలు జరుగుతున్నా కాపురం చేస్తూనే వచ్చిన సాయి ప్రియను అర్ధరాత్రి వేళ భర్త కొట్టడంతో చనిపోయిందని అనుమానాలు ఉన్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కమ్మికి ఉరేసు కున్నట్లు చిత్రీకరించి, మృత దేహం మెడకు చీరచుట్టారని మృతురాలి బంధువులు ఆరోపిస్తుండడం పలు అనుమానాలకుతావిస్తోంది. ఘటన సమాచారం అందుకున్న మదనపల్లె తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️