ప్రజాశక్తి-రైల్వేకోడూరు : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ చిట్వేలి మండల పరిధిలోని, మైలపల్లె రాచపల్లెకు చెందిన 7 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు బాలురు గత శుక్రవారం సాయంకాలం నీటి కుంటలో పడి మృతి చెందారు. మృతి చెందిన వారిలో చొక్కా రాజు దేవా (7), చొక్కా రాజు జయ (7) రెడ్డిచెర్ల యశ్వంత్ (7) ఊరిలో ఆడుకుంటూ ఊరి దగ్గరలో గల నీటి కుంటలో పడిపోయారు. రాత్రి ఇంటికి రాకపోయే సరికి వారి తల్లితండ్రులు చుట్టుప్రక్కల వెతకగా నీటి కుంటలో వారిని గుర్తించి, వెంటనే చిట్వేల్ లో ఆసుపత్రికి తరలించగా డాక్టర్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
