యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

Jun 8,2024 11:34 #Annamayya district

వ్యవస్థాపక అధ్యక్షులు తగాది రాజశేఖర్ వెల్లడి
ప్రజాశక్తి – బి.కొత్తకోట : తమ ఫౌండేషన్ ద్వారా నిర్విరామంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తగాది రాజశేఖర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్ధమైన సేవే లక్ష్యంగా ఫౌండేషన్ స్థాపించామన్నారు. ఇందులో భాగంగా శనివారం బెంగళూరు నగరం సమీపంలోని హోససకోట వద్ద గల ఎం.ఎన్.వి ఫౌండేషన్ నందు సుమారు 70 మంది వృద్ధులు, చిన్నారులకు దుప్పట్లు, అందజేయడం జరిగిందన్నారు.సేవా కార్యక్రమాల్లో సంస్థ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు.అటు ఏపీ ఇటు కర్ణాటకలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

➡️