ప్రజాశక్తి-రాయచోటి బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 2024-25లో రూ.13102 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించామని తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో జిల్లా సంప్రదింపుల కమిటీ(డిసిసి) జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డిఎల్‌ఆర్‌సి)సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికం మార్చి 31 నాటికి బ్యాంకులు సాధించిన ప్రగతి, 2024-25కు ప్రతిపాదిత వార్షిక రుణ ప్రణాళిక అంశాలపై జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు కలెక్టరుకు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 వార్షిక రుణ ప్రణాళికలో మార్చి 31 నాల్గవ త్రైమాసికం చివరినాటికి జిల్లాలో మొత్తంగా రూ.11,514 కోట్లు లక్ష్యం కాగా, రూ.14,678 కోట్ల రుణాలు అందించి 127.46 శాతం ప్రగతి సాధించడంపై బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా జిల్లా ఆర్థిక ప్రగతికి విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. గత సంవత్సరం ప్రాధాన్యత రంగంలో మనం సాధించిన ప్రగతి ఎంత, ఈ ఏడాది సాధించాల్సిన లక్ష్యం ఎంత అన్నది ముఖ్యం. ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలకు అధిక ప్రాధాన్యతతో దాదాపు 40 శాతం మేర రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు తమ కిందిస్థాయి బ్రాంచ్‌లకు కూడా తెలియజేసి రుణాలు అందించేందుకు కషి చేయాలన్నారు. 2024-25కు ప్రవేశపెట్టిన రూ.13102 కోట్ల వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు రూ.11338 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు. రూ.1764 కోట్లు ప్రతిపాదించామని పేర్కొన్నారు. ప్రాధాన్యత రంగాలు, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరులో బ్యాంకర్లు తమ లక్ష్యాలను తప్పనిసరిగా అధిగమించాలన్నారు. ఈ ఏడాది ప్రతిపాదిత వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రుణాలు రూ.9586 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రూ.116 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.16 కోట్లు మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ.9718 కోట్లు కేటాయించామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, ప్రోత్సహించేందుకు సూక్ష్మ చిన్న మధ్య తరహా యూనిట్లకు రూ.1159 కోట్లు రుణాలు అందించాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. గహ నిర్మాణాలకు రూ.133 కోట్లు, విద్యా రుణాలు రూ.58 కోట్లు, ఇతరత్రా రుణాలకు రూ.270 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని మహిళా సంఘాలకు జీవనోపాధికి నిర్దేశించిన రుణాలు, స్టాండప్ ఇండియా అంశాలలో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ అభివద్ధి సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు తమ వంతు తోడ్పాటు అందించి అధికంగా రుణాలు ఇవ్వాలన్నారు. వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి పెట్టుబడి కింద బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయంలో ఆరుగాలం శ్రమిస్తున్న కౌలు రైతులు, చేనేతలకు కూడా విరివిగా రుణాలు అందించి ఆదుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామీణాభివ ద్ధి వ్యవసాయ శాఖ నాబార్డు బ్యాంకులు సమన్వయంగా చర్చించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే కార్యాచరణతో ముందుకు రావాలన్నారు. జిల్లాలో జనాభా ప్రాతిపదికన జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఈ మేరకు అవసరమైన చోట బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేలా బ్యాంకర్లు కషి చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకర్లతో కలిసి 2024-25 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టరు ఆవిష్కరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు, ఎస్‌బిఐ ఆర్‌ఎం పి.మురళి నాయక్, నాబార్డ్ ఎజిఎం విజరు విహారి, దళిత ఇండిస్టియల్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్, యూనియన్, సప్తగిరి బ్యాంక్ ఆర్‌ఎంలు, వివిధ బ్యాంకర్లు, జిల్లా అధికారులు, డిక్కీ సభ్యులు పాల్గొన్నారు.
