పలమనేరు (చిత్తూరు జిల్లా) : మొగిలి ఘాట్లో బుధవారం రాత్రి 2 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని చక్కెర లోడుతో వెళ్తున్న లారీ రాసుకుంటూ వెళ్లింది. డీజిల్ లీకవడంతో మంటలు అంటుకుని ఆగివున్న లారీ క్లీనర్ మృతి చెందాడు. చక్కెర లోడు బోల్తా పడటంతో లారీ డ్రైవర్ మృతి మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. 20 రోజుల వ్యవధిలో ఈ రోడ్డుపై ఇది మూడో ప్రమాదం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
