ప్రమాదానికి గురైన లారీని ఢీకొట్టిన మరో లారీ

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : ప్రమాదానికి గురైన లారీని మరో లారీ ఢీకొట్టిన సంఘటన మంగళవారం మండలంలోని మొగిలి గాట్లో మంగళవారం చోటు చేసుకున్నది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం … మొగిలి ఘాట్‌ లో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ప్రమాదానికి గురైన లారీని రోడ్డుపై ఆపి ఉంచారు. ఈ లారీని ఉత్తరప్రదేశ్‌ నుండి వస్తున్న మరో లారీ ఢకొీట్టింది. ఈ సంఘటనలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం అత్తోరోలకు చెందిన షోహి ఖాన్‌ కు గాయాలు కాగా, బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

➡️