శింగరాయకొండ (ప్రకాశం) : లారీని మరో లారీ ఢీకొట్టడంతో క్యాబిన్‌లో లారీ డ్రైవర్ ఇరుక్కుపోయి కాలు విరిగిపోయిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున శింగరాయకొండలో జరిగింది. శింగరాయకొండ జాతీయ రహదారి పరిధిలోని లారీ యూనియన్ ఆఫీస్ ఎదురుగా కలకత్తా నుంచి బెంగళూరుకు వెళుతున్న కూరగాయల లారీ మరో లారీని ఢీకొట్టింది. దీంతో కూరగాయల లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయారు. ఆ డ్రైవర్ కలకత్తా కు చెందిన దావూద్‌గా పోలీసులు గుర్తించారు. హైవే పోలీసులతోపాటు జాతీయ రహదారి సిబ్బంది కలిసి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను జెసిబి సహాయంతో బయటకు తీయడం జరిగింది. డ్రైవర్ దావూద్ కు కాలు నలిగి విరిగిపోయింది. హైవే అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
